
జగన్.. శ్రీలంక ఎకనామిక్స్.. పాకిస్తాన్ పాలిటిక్స్?
వృద్ధి రేటు పెరిగినా విచిత్రంగా ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగాయని.. జగన్ ఎకనమిక్స్ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ఎదురు చూస్తోందని.. జగన్ ఓసారి నేల మీద నడిస్తే ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఓసారి నడిచినందుకు ఏపీ చాలా ఇబ్బందులు పడుతోందని.. జగన్ నేల మీద నడిస్తే.. ప్రజలు పరదాలు చాటుకు పోతారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.