జగనన్నా.. ఆ హామీ ఏమైందంటున్న అగ్రిగోల్డ్‌ బాధితులు?

Chakravarthi Kalyan
అగ్రిగోల్డ్ సంస్థ బాధితులు ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ గా ఏర్పడి న్యాయం కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన 6మాసాలలో పూర్తిగా అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పారని.. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి 3లక్షల చంద్రబాబు ఇస్తామన్నారని... కానీ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడం గురించి మాట్లాడటం లేదని అంటున్నారు. ఎన్నికల ముందు ఒక కమిటీ వేశారు ఆకమిటీలు ఏమైపోయాయో అనేది జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని.. మా తక్షణ డిమాండ్స్ రోజువారీ సోషల్ కోర్ట్ గా నియమించాలని వారు కోరుతున్నారు.

ఆస్తుల అన్నిటినీ వేలం వెయ్యటానికి నిబద్దత కల్గిన అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. యుద్ధం ప్రాతిపదికన కుటుంబాలని ఆదుకోవాలని.. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు మంజూరు చేయాలని.. అగ్రిగోల్డ్ సంస్థలు వారి ఆస్తులను అమ్ముకుంటుంది వారిని వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: