
రేవంత్ సెక్యూరిటీ.. కేసీఆర్‌కు ఎదురు దెబ్బ?
రేవంత్‌రెడ్డి పాదయాత్రకు 69 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది కూడా వివరించారు. అయితే ఆ భద్రత అంతా ట్రాఫిక్ నియంత్రణకే ఉంటోందని రేవంత్‌రెడ్డి న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం రేవంత్‌రెడ్డికి భద్రత పెంచాలని స్పష్టం చేసింది. పాదయాత్రతో పాటు రేవంత్‌రెడ్డి రాత్రి బస చేసే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.