కేసీఆర్‌ సర్కారుపై నాలుగో చార్జ్‌ షీట్‌?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ పార్టీ తరపున నాల్గవ చార్జిషీట్ ను ఏఐసీసీ పొగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి  విడుదల చేశారు. తెలంగాణను మిగులు బడ్జెట్ తో  కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే.. ఈ రోజు రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పుల కుప్పగా మార్చారని కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. ఎనిమిది రెట్లు అప్పు చేశారని.. అంచనాల బడ్జెట్ కు వాస్తవ బడ్జెట్ కు పొంతన ఉండటం లేదని.. గతేడాది 2.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెడితే.. 1.50 లక్షల కోట్లే వాస్తవ రూపంలో ఉందని కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

మంత్రి హరీష్ రావు భజన చేయడం తప్ప బడ్జెట్ వాస్తవ రూపం లేదని.. రైతు రుణమాఫీ విషయంలో కూడా కేసీఆర్ మోసం చేశారని... లక్ష రూపాయల రుణమాఫీ కావాలంటే 18 వేల కోట్లు అవసరమైతే.. బడ్జెట్ లో కేవలం 6 వేల కోట్లే కేటాయించిందని కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. విద్య, వైద్యానికి సరైన కేటాయింపులు లేవన్న కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. 18 లక్షల డబుల్ బెడ్రూం కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పుడు ఇస్తామన్న 3 లక్షలు కూడా తూతూమంత్రంగా కేటాయింపులు ఉన్నాయని.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందనడానికి బడ్జెట్ నే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: