వైసీపీ నోటి దురుసే.. బాబు, పవన్‌ను ఏకం చేస్తోందా?

Chakravarthi Kalyan
పవన్‌ కల్యాణ్, చంద్రబాబు సమావేశం మరోసారి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అనేక చర్చలకు దారి తీస్తోంది. పవన్‌ కల్యాణ్, చంద్రబాబు కలయికకు వైసీపీ నేతల నోటి దురుసే కారణమా.. అవునంటున్నారు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌. గుంటూరులో జరిగిన అవోపా స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నా చంద్రబాబు ను కలిసే పరిస్థితిని వైసీపీయే  కల్పించిందని టీజీ వెంకటేష్‌ అన్నారు. వైసీపీ నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని టీజీ వెంకటేష్‌ అన్నారు.

ప్రైవేటు స్కూళ్ళను మూయించాలనే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్న టీజీ వెంకటేష్‌.. కానీ అమ్మఒడితో ప్రైవేటు పాఠశాలలు పూర్తి స్థాయిలో నిండాయని అంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశామని అందుకే వైకాపా గెలిచిందని టీజీ వెంకటేష్‌ అన్నారు. ఈ సారి మాత్రం బీజేపీ గెలుస్తుందని టీజీ వెంకటేష్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: