జగన్.. భూమి పంచుతారా.. లాక్కోమంటారా?

Chakravarthi Kalyan
భూమిలేని గ్రామీణ పేదలకు వెంటనే భూ పంపిణీ  చేయాలని-లేకపోతే ఐక్య ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకొస్తామని రాష్ట్రస్థాయి భూసాధన సదస్సు నిర్ణయించింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వాటిని శీతలగిడ్డంగిలో పడేశారని వక్తలు విమర్శించారు. రాష్ట్రంలో 59 శాతం గ్రామీణులకు భూములు లేవని... పేదలకు అనుకూలంగా ఎన్ని చట్టాలు వచ్చినా వాటిని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు... పేదలకు భూమి పంచాలనే చిత్తశుద్ధ కనబరచడం లేదని నేతలు ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని పాలకుల కనుసన్నల్లోని పెద్దల చేతుల్లోకి, భూ మాఫియా చేతుల్లోకి వెళ్తోందని నేతలు దుయ్యబట్టారు.  పేదల సాగులోని భూములకు రెవెన్యూ రికార్డుల్లో సైతం చోటు దక్కడం లేదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసి పేదలకు పరిహారం ఇవ్వడం లేదని నేతలు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: