పెద్దనోట్ల రద్దు కేసు.. మోదీకి షాక్ తప్పదా?
ఈ కేసులో కక్షిదారులంతా తమ వాదనలను లిఖితపూర్వకంగా ఈనెల 10లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సీల్డు కవర్ లో రికార్డులు సమర్పిస్తామని అటార్నీ జనరల్ వెంకటరమణి తెలిపారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు విన్నది. ఆర్థిక విధాన వ్యవహారాల్లో న్యాయసమీక్షకు అవకాశాలు పరిమితంగానే ఉన్నా.. కోర్టు చేతులు కట్టుకొని కూర్చోబోదని సుప్రీం ధర్మాసనం చెప్పడం ఉత్కంఠకు దారి తీస్తోంది. మరి తుది తీర్పు ఎలా ఉంటుందో?