తిరుమల బాలాజీ ఆలయానికి బంగారు తాపడం?
గతంలో 1957, 1958 సంవత్సరంలో శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు జరిగాయి. అప్పుడు జరిగినట్టే ఈసారి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు హుండీలో సమర్పించిన స్వర్ణ కానుకలతోనే ఆనందనిలయానికి బంగారు తాపడం చేయాలని టీటీడీ నిర్ణయించింది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని జనవరి 2వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరుస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గత ఏడాది లాగానే పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వారాలు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.