మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్..?
ఇటీవల విడుదలైన హుక్ స్టెప్పు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండీగా మారింది. ఈ పాటకు చిరంజీవి డాన్స్ కూడా హైలెట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. అయితే తాజాగా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చిరంజీవికి ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ పాటను ముందుగా విడుదల చేయలేదని డైరెక్ట్ గా అభిమానుల కోసమే థియేటర్లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ కొత్త సర్ప్రైజ్ ఉంటుందా ?ఉండదా అనే విషయంపై అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అభిమానులను మరింత ఉత్సాహాన్ని నింపేలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా టికెట్ల ధరల పెంపు విషయంపై, ప్రీమియర్ షో విషయంపై కూడా గుడ్ న్యూస్ అందింది. మొత్తానికి సంక్రాంతి పండుగకు థియేటర్లలో ఈసారి చిరంజీవి కనిపించబోతుందని చెప్పవచ్చు. మరి సినిమా ఏ విధంగా ఫ్యాన్సీని మెప్పిస్తుందో తెలియాలి అంటే జనవరి 12 వరకు ఆకాల్సిందే.