నైజాంలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఆ ప్లేస్లో రాజా సాబ్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది  రాజా సాబ్ మూవీ జనవరి 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ ని నైజాం ఏరియాలో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్  10 మూవీలు ఏవి ..? అందులో ది రాజా సాబ్ మూవీ ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ నైజాం ఏరియాలో మొదటి రోజు 25.60 కోట్ల కలెక్షన్లను వసులు చేసి మొదటి స్థానంలో కొనసాగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా 24.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 23.35 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానం లోనూ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ 22.64 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ 22.55 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ , ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 19.60 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా 16.45 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 15.70 కోట్ల కలెక్షన్లను చేసి 8 వ స్థానం లో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ 13.68 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరి హర వీరమల్లు సినిమా 12.40 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: