గరికపాటి మరో వివాదం.. ఆడవాళ్లపై అలా మాట్లాడొచ్చా?

Chakravarthi Kalyan
ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు.. ఇటీవల తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మహిళల వస్త్రధారణపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసభ్య వ్యాఖ్యలు చేశారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

ప్రవచనాల ముసుగులో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మహిళలను కించపరుస్తూ అత్యాచారాలు చేసే వారిని ప్రోత్సహిస్తున్నారని మహిళలు మండిపడ్డారు. ఐదు దశాబ్దాల వయసు దాటినప్పటికీ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇంకా మహిళల వస్త్రధారణపై అసభ్యంగా మాట్లాడడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేందుకేనా ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిందని దుయ్యబట్టారు. గరికపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మహిళలను కించపరుస్తూ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆయనపై చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: