విశాఖలో అందరి చూపులూ ఆ వైపే..?
మొత్తం 20వేల పుస్తకాలను విశాలాంధ్ర సంస్థ విశాఖ ప్రదర్శనలో అందుబాటులో ఉంచింది. బాల సాహిత్యం, సైన్స్ పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం వంటి ఎన్నో పుస్తకాలు లభిస్తున్నాయి. అన్ని స్థాయిల పాఠ్యపుస్తకాలు, ప్రాచీన, ఆధునిక భాషా సాహిత్యం పుస్తక మహోత్సవంలో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నవల, కథ, నాటకం, జీవిత చరిత్రలు, వ్యాసాలు.. ఇలా ఒకటేమిటి.. అన్ని సాహితీ ప్రక్రియలోని గ్రంథాలు విశాఖ విశాలాంధ్ర పుస్తక మహోత్సవంలో పుస్తక ప్రియులను రారమ్మంటున్నాయి.