చైనాతో ఆంధ్రా ఎగుమతులకు భలే చిక్కు ?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా ఎగుమతుల విషయంలో  కొంత ఇబ్బందులున్నాయని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు. చైనా మార్కెట్ పూర్తిగా షట్ డౌన్ అవడంతో ఎగుమతులకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. కేంద్రం చైనా ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ఉపయోగం ఉంటుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు. రైతులకు స్ధిరమైన ధర ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటామన్న మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు... ఆక్వా కంపెనీలు, ఫీడ్, కల్చర్ చేసే రైతులతో సమావేశమయ్యామని తెలిపారు.


ఆక్వా  రైతులకు స్ధిరమైన రేట్లను నిర్ణయిస్తామన్న మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు.. 100 కౌంటుకు 210 రూపాయలుగా నిర్ణయం తీసుకున్నారు.  ఆక్వా  రంగంలో ప్రతిష్టంభనలకు కారణం విదేశీ మార్కెట్ లో ఒడిదుడుకులేనని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు తేల్చి చెప్పారు. రైతులు,ఆక్వా కంపెనీలు సమన్వయం కుదిరేలా రేటు నిర్ణయించామని.. క్రాప్ హాలిడే అనే మాటే లేదని.. పది రోజుల పాటు ఇవే రేట్లు ఉంటాయని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు వివరించారు.  కేంద్ర ప్రభుత్వానికి  రిప్రజెంటేషన్ ఇచ్చామని మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: