మోదీ వీటి సంగతేంటి.. తెలంగాణ బుద్ధి జీవుల నిలదీత?

Chakravarthi Kalyan
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 12న తెలంగాణకు వస్తున్నారు. ఈ సమయంలో పలువురు ప్రొఫెసర్లు, రచయితలు ఆయనకు ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ బుద్ధి జీవుల తరపున బహిరంగ లేఖ అంటూ ఈ లేఖ విడుదల చేశారు. ప్రధాని క్రితంసారి వచ్చినపుడు ఇచ్చిన హామీలను వారు లేఖలో గుర్తు చేశారు. అవేమీ నెరవేరలేదని ప్రధానికి వివరించారు. తెలంగాణ ప్రజానీకం తరపున కొన్ని అంశాలను లేఖలో ప్రధానికి గుర్తు చేశారు. ఎనిమిది డిమాండ్లను లేఖ ద్వారా తెలంగాణ ఆకాంక్షలను  ప్రధానికి వారు వివరించారు.

తెలంగాణ పట్ల కక్ష, వివక్ష, పక్షపాత ధోరణి విడనాడాలని కోరిన ప్రొఫెసర్లు, రచయితలు..... మతతత్వ ధోరణి విడనాడి దేశఐక్యత, బహుళతత్వాన్ని కాపాడేలా పాలన కొనసాగించాలనికోరారు. దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

విభజనచట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని, ఐటీఐఆర్ పునరుద్ధరించాలి... లేదా సమాన ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తెలంగాణలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ కేటాయించాలని వైద్యకళాశాలలు, విద్యాసంస్థలు ఏర్పాటుచేయాలని.............. విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి వివక్ష లేకుండా కొనుగోలు చేయాలన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: