బాబోయ్.. ఏపీలో ఆ వైరస్‌.. అంతా అలర్ట్?

Chakravarthi Kalyan
ఇది వైరస్‌ జబ్బుల కాలం.. ఒక్క కరోనా వైరస్‌ ప్రపంచాన్నే వణికించింది. ఆ తర్వాత కూడా అనేక వైరస్‌ల ద్వారా వచ్చే జబ్బులు కంగారు పెడుతున్నాయి. తాజాగా ఏపీలో లంపీ వైరస్ కలకలం సృష్టిస్తోంది. అయితే.. ఈ లంపీ వైరస్ జంతువుల్లో వస్తుంది. అందుకే లంపీ వైరస్‌పై అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

జంతువుల్లో లంపీ వైరస్‌ వ్యాపిస్తుందన్న సమాచారం వస్తోందన్న అధికారులు.. దీనిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలంటున్నారు. వైరస్‌ జంతువులకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. సరిపడా మందులను, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలని ఇటీవల సీఎం కూడా ఆదేశించారు. సీఎంతో జరిగిన సమీక్షకు పశు సంవర్ధక, పాడి అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పశు సంవర్ధక శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఆర్‌. అమరేంద్ర కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: