తిరుమలలో కొత్త పరకామణి.. ఈ విశేషాలు తెలుసా?

Chakravarthi Kalyan
తిరుమలలో కొత్త పరకామణి భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పరకామణిలో దాదాపు రెండు వందల మంది ఉద్యోగులు నాలుగు విడతల్లో విధులు నిర్వహిస్తారు. రోజుకు పద్నాలుగు గంటల పాటు నిరంతరాయంగా డబ్బు లెక్కింపు జరుగుతుంది. సగటున నాలుగు కోట్ల రూపాయల పైబడి ఆదాయం లెక్కిస్తారు. ఇప్పటి వరకూ భక్తులు సమర్పించే కానుకల్లో కరెన్సీ నోట్లను తిరుమల ఆలయంలో... నాణేలను తిరుపతి తితిదే పరిపాలనా భవనంలో లెక్కిస్తున్నారు. ఇకపై హుండీ ఆదాయం మొత్తాన్ని ఇకపై తిరుమలలోనే లెక్కిస్తారు.

ఈ పరకామణి భవనాన్ని 23 కోట్ల రూపాయలతో 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థుల్లో నూతన పరకామణి భవనాన్ని నిర్మించారు. బ్రహ్మోత్సవాల వేళ ఈ కొత్త పరకామణి భవనాన్ని ప్రారంభించారు. అత్యంత ఆధునికంగా.. పటిష్ట భద్రత ఏర్పాట్లతో పరకామణి భవనాన్ని నిర్మించారు. ఈ పరకామణిలో అత్యాధునిక నగదు లెక్కింపు యంత్రాలను ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: