వివేకా హత్య కేసు.. మరో సంచలనం?

Chakravarthi Kalyan

మాజీ మంత్రి, సీఎం బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొంతకాలంగా నత్తనడకన సాగుతోంది. అయితే ఈ కేసులో తాజాగా మళ్లీ సీబీఐ విచారణ మొదలైంది. దాదాపు ఆరు నెలల తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ విచారణ చేపట్టారు. పులివెందుల అతిథి గృహంలో సీబీఐ  అధికారి అంకిత్ యాదవ్ సమక్షంలో అనుమానితులను ప్రశ్నించారు. వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఇనయతుల్లాను సుదీర్ఘంగా ప్రశ్నించారు.  ఈ ఇనయాతుల్లానే 2019 మార్చి 19న రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని మొదటగా ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ వీడియోలను ఇతరులకు తన మొబైల్ ద్వారానే పంపారు. ఈ విషయంపైనే సీబీఐ అధికారులు అతన్ని విచారించారు.
వివేకా హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని ఎవరు శుభ్రం చేశారనే దానిపైనా సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. గతంలో కూడా ఇనయతుల్లాను అనేకమార్లు సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: