ఆ అధికారి అక్రమాలపై సీఎం జగన్ ఫుల్ ఫైర్?
రాజాబాబు జారీ చేసిన వివాదాస్పద 23 జీవోను కూడా తక్షణం రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి చర్యలనూ సహించేది లేదని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గత రెండు నెలల్లో రాజాబాబు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం జగన్ ఆగ్రహంతో రవాణ శాఖ చర్యలు చేపట్టింది. కొత్త కమిషనర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పాత కమిషనర్ ఇచ్చిన జీవో రద్దు కావడంతో 23 మంది అధికారులు తమ పాత స్థానాల్లోనే కొనసాగుతారని తెలుస్తోంది.