ఇంజినీరింగ్‌లో ఆ సీట్లకే ఫుల్ డిమాండ్?

Chakravarthi Kalyan
ఇంటర్ తర్వాత చాలా మంది చేసే కోర్టు ఇంజినీరింగ్.. అయితే.. ఈ ఇంజినీరింగ్‌లో కొన్ని బ్రాంచ్‌లకే డిమాండ్ బాగా ఉంది. ప్రత్యేకించి కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లకు ఫుల్ గిరాకీ ఉంది. ఈ ఏడాది తెలంగాణ  ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్‌ మొదలైన కొన్నిరోజుల్లోనే కంప్యూటర్‌ సైన్స్‌  సీట్లు నిడిపోయాయి. మొత్తం తెలంగాణలో 41,506 కంప్యూటర్‌ సైన్స్‌  సీట్లు ఉంటే.. దాదాపు అన్నీ నిండిపోయాయి. ప్రస్తుతం కేవలం 600 సీట్లు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.


అదే సమయంలో సివిల్‌, మెకానికల్‌ బ్రాంచ్‌లు మాత్రం మూడో వంతు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తెలంగాణ  ఎంసెట్‌ తొలి విడత సీట్ల కేటాయింపులో కనిపిస్తున్న సీన్ ఇది. ముందుగా ఊహించినట్లే కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో బీటెక్‌ సీట్లు చాలా వేగంగా పూర్తయ్యాయి. ఈ సీట్లలోని 17 బ్రాంచీల్లో 98.49 శాతం సీట్లు నిండినట్టు తెలుస్తోంది. ఇక వీటి తర్వాత డిమాండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీలకు ఉంది. ఈ బ్రాంచీల్లో 80.96 శాతం సీట్లు నిండాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: