జగనన్నా.. ఈ సర్పంచుల గోడు పట్టదా?

Chakravarthi Kalyan
సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోందని సర్పంచుల సంఘం నేతలు భావిస్తున్నారు. తమ సమస్యలపై అనేక జిల్లాల్లో సర్పంచులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను పీడి ఖాతాలకు మళ్లించాలన్న ప్రభుత్వం ఆదేశాలను నిరసిస్తూ సంబంధిత ఉత్తర్వులను చించివేస్తున్నారు. గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులు మాకు తెలియకుండా తీసేసుకున్నారని వారు అంటున్నారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు లాగేయాలని చూస్తున్నారని సర్పంచులు ఆరోపించారు.


ఇక ఇలాగైతే గాంధీజి కలలు గన్న గ్రామస్వరాజ్యం ఎలా సాధ్యమని సర్పంచులు ప్రశ్నించారు. నిధులు లేకపోవటం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని. సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మోహం చూపించుకోలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాగైతే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందంటున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నట్లే.. గ్రామాన్ని బాగు చేయాలని సర్పంచులు భావిస్తారని గుర్తు చేస్తున్నారు. నిధులు లేకపోవటంతో సర్పంచులు గ్రామాల్లో పారిశుద్య పనులు కూడా చేయలేకపోతున్నారని వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: