నటి ఇంద్రజ లవ్‌స్టోరీ.. భర్తకు పెట్టిన కండీషన్స్ ఇవే?
ఇంద్రజ భర్త తమిళంలో కొన్ని సీరియళ్లు, యాడ్ ఫిల్మ్స్ చేశారు. ఇంద్రజ రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. కేవలం 13 మందితో హోటల్‌కు వెళ్లి భోజనం చేసి ఇంటికి వెళ్లిపోయారట. రిసెప్షన్, హానీమూన్ అంటూ ఏమీ చేయలేదట. అంతే కాదు.. పెళ్లికి ముందు భర్తకు ఆమె రెండు షరతులు పెట్టారట. అవేంటంటే.. పెళ్లయినా అమ్మా, నాన్న తనతోనే ఉంటారని ముందే చెప్పారట. అలాగే తన చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పిందట.