
BREAKING: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్!
మన భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జగ్‌దీప్ ధన్‌కర్.గోకల్‌చంద్ ఇంకా కేసరి దేవి దంపతులకు ఆయన జన్మించారు. ప్రాథమిక విద్యను కితానా గ్రామంలోనే ఆయన పూర్తి చేశారు. అనంతరం చితోర్‌ఘర్ సైనిక స్కూళ్లో ఆయన చదివారు. తరువాత రాజస్థాన్ యూనివర్సీటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.ఇక సుదేశ్ ధన్‌కర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తే కూడా ఉన్నారు. జగ్‌దీప్ ధన్‌కర్ కు పలు రంగాలపై పట్టుంది. రాజకీయాలతో పాటు లాయర్‌గా ఇంకా క్రీడాకారుడిగానూ రాణించారు.గతంలో సుప్రీంకోర్టు అడ్వొకేట్‌గా కూడా పనిచేశారు.