అప్పుల ఊబిలో.. ప్రపంచ దేశాలు?

Chakravarthi Kalyan

శ్రీలంక ఆర్థిక సంక్షోభం పలు దేశాలను ఆలోచనలో పడేస్తోంది. శ్రీలంక తరహాలోనే మరికొన్ని దేశాలు కూడా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధనం కోసం చేసిన అప్పులు ఈ దేశాల ఆర్థిక పతనానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. శ్రీలంక, లెబనాన్, రష్యా, సురినేమ్, జాంబియా దేశాలు ఇప్పటికే రుణాలు చెల్లించలేక ఎగవేత దేశాల జాబితాలో చేరిపోయాయి.


తాజాగా బెలారస్ కూడా ఈ జాబితాలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 12 దేశాలు అప్పులు ఎగవేసే దశకు చేరుకున్నట్టు ప్రపంచ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ దేశాలన్నీ కలిపి మెుత్తం దాదాపు 400 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.  వీటిలో ఒక్క అర్జెంటీనా మాత్రమే 150 బిలియన్‌ డాలర్ల అప్పు చెల్లించలేని స్థితిలో ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు డాలర్‌ విలువ 13  శాతం పెరగడం కూడా ఈ సంక్షోభాలకు కారణంగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: