జగన్‌ మావయ్యా.. మా బాధలు పట్టించుకోవా?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజే అనేక చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. చ‌దివేందుకు ఇంటికి ద‌గ్గర‌లో ఉన్న బ‌డినే తీసేయ‌డం వల్ల తమ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇలా చేయడం పిల్లలను చ‌దువుకి దూరం చేయ‌డ‌మే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 కిలో మీటరు పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోను, హైస్కూల్స్ లోను కలపటం వల్ల ఈ సమస్య వచ్చింది.
పిల్లల‌కి పాఠ‌శాల‌లు ఒక కిలోమీట‌రు దూరంలోపే ఉండాల‌ని విద్యావిధానాలు చెబుతున్నాయి. కానీ.. ఈ నిర్ణయంతో ఏకంగా 3 కిలోమీట‌ర్ల దూరానికి పాఠ‌శాల‌లు త‌ర‌లిపోయాయి. ఇది ప్రభుత్వ విద్యని పేద‌ల‌కి దూరం చేయ‌డ‌మే అని తల్లిదండ్రులు మండిపడ్డారు. జాతీయ విద్యావిధానం, స్కూల్ రేష‌న‌లైజేష‌న్ పేరుతో ప్రభుత్వం తమ పిల్లలను ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ కొత్త  విద్యావిధానం వ‌ల్ల ప్రస్తుతం ఉన్న 42 వేల పాఠ‌శాల‌లు భ‌విష్యత్తులో 11 వేల‌కి త‌గ్గిపోనున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: