జగన్.. తెలంగాణ భూముల ధరలు పెంచుతున్నారా?

Chakravarthi Kalyan
జగన్ సీఎం కాగానే తెలంగాణాలో భూముల ధరలు పెరిగాయట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. అమరావతి రైతులు.. జగన్ సీఎం అయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలతో హైదరాబాద్ లో భూముల ధరలు పెరుగుతున్నాయట. ఆంధ్రా ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం బాగుపడతారంటున్న అమరావతి రైతులు.. అమరావతి నిర్మాణంపై హైకోర్టు స్పష్టమైన తీర్పు వచ్చినా ప్రభుత్వం ఇంకా రైతుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో రైతులను తప్పుబట్టాలని ప్రభుత్వం చూస్తోందని వారు విమర్శించారు.


ప్రభుత్వం తీరుని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రైతులపై ఉందని అంటున్నారు. అమరావతి నిర్మాణంతో రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల రూపాయల ఆదాయం... జగన్ కారణంగా ఆవిరైపోయిందని రైతులు ఆరోపించారు. అమరావతి విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించకపోవటాన్ని రైతులు తప్పుబడుతున్నారు. సర్కారు తీరుపై మరో రూపంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు రైతులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: