అమెరికాకు రష్యా వార్నింగ్.. ఏ రేంజ్‌లో అంటే..?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ పై యుద్ధం విషయంలో రష్యా మరోసారి అమెరికాను హెచ్చరించింది. ఇకపై అమెరికా  ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణుల సరఫరాను ప్రారంభిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అమెరికా అలా చేస్తే రష్యా ఇకపై కొత్త లక్ష్యాలపై దాడులు చేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి క్షిపణులను ఉక్రెయిన్‌కు పంపితే రష్యా..  ఇప్పటి వరకూ దాడి చేయని కొత్త లక్ష్యాలపై గురి పెట్టాల్సి వస్తుందని పుతిన్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చేశారు.


ఓ రష్యన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. అయితే.. రష్యా చెబుతున్న ఆ కొత్త లక్ష్యాలు ఏమిటనేది మాత్రం పుతిన్  క్లారిటీ ఇవ్వలేదు. అయితే. పుతిన్‌ ఆ విషయంలో ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి.. ఈ గొడవంతా ఎందుకు వస్తోందంటే.. రష్యాతో యుద్ధం కోసం తమకు మల్టీ రాకెంట్ లాంచ్ సిస్టమ్‌లు కావాలని ఉక్రెయిన్‌ పశ్చిమ దేశాలను కోరుతోంది. ఉక్రెయిన్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తున్న నాటో దేశాలు ఆయుధాలు అందిస్తున్నాయి. ఇది కాస్తా రష్యాకు కోపం తెప్పిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: