కోనసీమ గొడవలకు అసలు కారణం అదేనా?
అయితే.. ఈ గొడవలకు స్థానికంగా వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణే కారణం అంటున్నారు పవన్ కల్యాణ్.. వైసీపీలోని వర్గాల గొడవ ను అల్లర్ల దిశగా మార్చారని పవన్ ఆరోపిస్తున్నారు. ఈ అల్లర్లతో వైసీపీ మంత్రి కూడా బాధితునిగా మారిపోవటం బాధాకరమన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ గొడవల గురించి రాష్ట్ర, కేంద్ర నిఘా విభాగాలకు తెలుసని అన్నారు. ఇంకా వైసీపీ నేతలు అధికార మదంతో మాట్లాడుతున్నారని.. సంబంధం లేని జన సైనికులను పోలీసులు వేధిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారు. కోనసీమలో గొడవలు జరగటం కోసమే నెల రోజుల గడువు ఇచ్చారని.. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఏం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.