పిల్లోడికి ఫోనిస్తే.. రూ.36 లక్షలు పోగొట్టాడు?

Chakravarthi Kalyan
ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లలైతే బొమ్మల కథలు.. కాస్త పెద్దవాళ్లయితే వీడియో గేములు తెగ ఆడేస్తున్నారు. అయితే పోనీ పిల్లలే కదా.. ఏడుస్తున్నారనో.. గొడవ చేస్తున్నారనో.. మారం చేస్తున్నారనో.. ఫోన్‌ ఇస్తే ఏకంగా లక్షల సొమ్ము పొగొట్టిన ఉదంతం హైదరాబాద్‌లో జరిగింది. ఓ మైనర్ బాలుడు తండ్రి ఫోన్ ద్వారా ఆన్  లైన్ గేమింగ్ ద్వారా ఆడి ఏకంగా రూ. 36 లక్షలు పోగొట్టిన వార్త కలకలం సృష్టిస్తోంది.
అవసరం కోసం నగదును  డ్రా చేద్దామని  బ్యాంకుకు వెళ్తే అకౌంట్లోని 36 లక్షలు మాయిం అయిన విషయం తెలిసింది.  అదేంటని వాకబు చేస్తే.. ఆన్ లైన్ గేమ్ లో డబ్బులు పోయినట్లుగా తేలింది. దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు. అకౌంట్లో డబ్బులు పోయిన విషయంపై వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: