అల్లు అర్జున్ ఆంధ్రోడు అంటూ రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ?
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆంధ్రుడు అంటూ... రెచ్చిపోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. తాజాగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి... అల్లు అర్జున్ అంశం పైన మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రుడు అంటూ అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై... కక్షగట్టి మాట్లాడుతున్నాడని... అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు భూపతిరెడ్డి.
ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... తెలంగాణలో అల్లు అర్జున్ సినిమాలు అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. లేకపోతే అల్లు అర్జున్ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ రెచ్చిపోతున్నారని అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు.
ఇది ఇలా ఉండగా ఇవాళ పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. మొన్న ప్రెస్ మీట్ లో పోలీసులపై అలాగే తెలంగాణ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీంతో ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ ఎదుర్కొన్నారు అల్లు అర్జున్.