అభిమాని హాస్పిటల్ బిల్లు కట్టిన జూనియర్ ఎన్టీఆర్ ?

Veldandi Saikiran
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్.... తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన అభిమానికి ఆసుపత్రి ఖర్చులు మొత్తం కట్టి... అతని డిస్చార్జ్ చేసేలా... జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి చర్యలు తీసుకున్నారు.
 

వాస్తవంగా నిన్నటి నుంచి... సదరు అభిమాని తల్లి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా లో వైరల్ గా మారాయి. తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయినప్పటికీ... ఎన్టీఆర్ ప్రకటించిన సహాయం అందలేదని ఆమె పేర్కొన్నారు. 20 లక్షలు చికిత్స కోసం ఇస్తానని జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పినట్లు సదరు మహిళ పేర్కొంది.
 దీంతో తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి గా విలన్ గా మారిపోయారు. మాటల వరకే జూనియర్ ఎన్టీఆర్... నిలిచిపోయారా అని కొంతమంది మండిపడ్డారు కూడా...! అయితే ఈ వివాదం పై వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్... తగిన చర్యలు తీసుకున్నారు. తన అభిమాని ఆసుపత్రి బిల్లు కట్టి ఆర్థిక సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.
 

క్యాన్సర్ తో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రి లో... జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.  అయితే ఇవాళ అతని ఆసుపత్రి బిల్లు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ కట్టడం జరిగింది. దాదాపు 20 లక్షల వరకు జూనియర్ ఎన్టీఆర్ ఆ బిల్లు కట్టారట. దీంతో ఆ ఫ్యామిలీ  కి బిగ్ రిలీఫ్ దక్కింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ న్యూస్ చూసిన ఫ్యాన్స్ అలాగే నెటిజెన్స్ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రశంసిస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ తల్లి కూడా ఆయనకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: