పోలీసుల దగ్గర అల్లు అర్జున్ ఎమోషనల్..లంచ్ కూడా చేయకుండా!

MADDIBOINA AJAY KUMAR
నేడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ని పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకి సంబంధించి పోలీసులు విచారించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఇవాళ అధికారులు అల్లు అర్జున్ కి చూపించారు. దీంతో ఆ వీడియో చూసిన ఐకన్ స్టార్ ఎమోషనల్ అయ్యారని సమాచారం. అయితే ఈ విచారణ 3:35 గంటల పాటు సాగింది.  ఈ కేసు విచారణ సమయంలో అల్లు అర్జున్ కేవలం కారులోని బిస్కెట్స్, డ్రైఫ్రూట్స్ మాత్రమే తిని టీ తగారని తెలుస్తోంది. ఆయన లంచ్ కూడా చేయలేదని సమాచారం. ఇదిలా ఉండగా.. బన్నీ దర్యాప్తులో కొన్ని ప్రశ్నలకు తెలియదు అని బాధులిచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇక ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‎ను అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వెంటనే బన్నీ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. ఈ కేసులో అల్లు అర్జున్‎కు హై కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ క్రమంలో సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్ కి మహిళ చనిపోయిందని తెలిసినప్పటికి ఆయన సరైన పద్దతిలో స్పందించలేదని సమాచారం. దీంతో ఇటీవల జూబ్లీహిల్స్‎లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు. దాడి అనంతరం అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు ప్రేరేపించకూడదని కోరారు. కాస్తా ఓపికగా ఉండాలని అభిమానులను రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: