చికెన్ తింటున్నారా.. ఈ విషయం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం..

frame చికెన్ తింటున్నారా.. ఈ విషయం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం..

praveen
మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే మాంసాలకు చికెన్ ముందు ప్లేస్ లో ఉంటుంది. చికెన్ లేనిదే ముద్ద దిగని వాళ్ళు ఎంతో మంది. నోటి ముందు చికెన్ ఉంటే చాలు లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అది ఫ్రై పీస్ అయినా, బిర్యానీ అయినా, చికెన్ కర్రీ అయినా సరే.. చికెన్ అంటే చాలు ఇంక వేరే ఏమీ వద్దంటారు. గుడిలో ప్రసాదంలా చికెన్ కోసం ఎగబడేవాళ్లు కూడా లేకపోలేదు.
అయితే చికెన్ ను ఇష్టంగా తింటారు సరే కానీ.. రోజూ చికెన్ తింటే మాత్రం అంతే సంగతులు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ చికెన్ లాగించేస్తే మీ ఆరోగ్యం గాల్లో కలిసిపోతుంది అని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రతిరోజూ చికెన్ తింటే మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయట. దీని వల్ల ఎముకలు గుల్లబారిపోతాయి, కీళ్ల నొప్పులు మొదలవుతాయి, ఇక నడవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. అంతే కాదు గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు భయపెడుతున్నారు.
ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లయితే చికెన్ జోలికి వెళ్లకపోవడమే మంచిది అని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. చికెన్ ను దూరం పెడితేనే కిడ్నీలు సేఫ్ గా ఉంటాయంటున్నారు. చికెన్ ఎంత ఇష్టమైనా, రోజూ మాత్రం తినకండి అంటున్నారు డాక్టర్లు. అందుకే చికెన్ తినడం తగ్గించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరీ ముఖ్యంగా వారంలో ఒక్కసారి తినండి చాలు, ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
అంతే కాదు, అతిగా చికెన్ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయట. ఇది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, అధిక ప్రోటీన్ కారణంగా కిడ్నీలు మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది, ఇది కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మరింత ప్రమాదకరం. అందుకే చికెన్ ను పూర్తిగా మానేయమని చెప్పడం లేదు కానీ, మితంగా తినమని సూచిస్తున్నాం. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు కొంచెం మోతాదులో తింటే సరిపోతుంది. ప్రతిరోజూ తినడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, సమతుల్య ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వార్తను బంధుమిత్రులతో పంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: