జగన్‌పై వారి పోరాటం ఫలిస్తుందా..?

Chakravarthi Kalyan
ఏపీలో ఇటీవల వెలువడిన గ్రూప్‌ వన్‌ ఫలితాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ఒక ఫలితాలు ఇచ్చి.. కోర్టు తీర్పు తర్వాత మరో ఫలితాలు ఇచ్చారు. ఈ రెండిట్లోనూ చాలా తేడాలు రావడంతో అవకాశం కోల్పోయిన గ్రూప్‌ వన్ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అందులో భాగంగా రాజకీయ నేతలను కలుస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కూడా గ్రూప్-1 అభ్యర్థులు కలిశారు.


2018 గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటున్న అభ్యర్థులు.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందంటున్నారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్‌లో 62శాతం తేడా ఉందని.. మాన్యువల్‌లో 80 శాతం తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. డిజిటల్‌ మూల్యాంకనంపై హైకోర్టులో ఏపీపీఎస్సీ అఫిడవిట్ దాఖలు చేసిందని.. మూల్యాంకనం పారదర్శకంగా చేసినట్లు ఏపీపీఎస్సీ అఫిడవిట్‌ ఇచ్చిందని.. మరి ఈ రెండింటిలో ఏది పారదర్శకం అనే దానిపై న్యాయ విచారణ జరగాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరంగా పోరాటానికి సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని  అభ్యర్థులు చెబుతున్నారు. మరి వీరి పోరాటం ఫలిస్తుందా?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: