రేవంత్‌.. 'రెడ్డి కులం' కామెంట్లపై విమర్శల కలకలం?

Chakravarthi Kalyan
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల కర్ణాటకలో జరిగిన  రెడ్డి సంక్షేమ సభలో కులాల గురించి ప్రస్తావించడంపై సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను తాను సమర్ధించడం లేదని ఇటీవల ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి  వ్యాఖ్యానించారు. తాజాగా పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ కూడా రేవంత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కి నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా రేవంత్ రెడ్డికి నాలుగైదు పేజీల సుదీర్ఘమైన లేఖ రాశారు. అయితే.. వీరిద్దరి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగూరు హెచ్చరించారు. ఈ నెల 7వ తేదీన గాంధీ భవన్ లో  రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని నాయకులు మరిచిపోవద్దని మాణిక్కం ఠాగూర్  హెచ్చరించారు. మే 7వ తేదీన గాంధీభవన్ లో మన నాయకులు రాహుల్ గాంధీ గారు చేసిన ప్రసంగాన్ని నాయకులు మర్చిపోవద్దని.. పార్టీ అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కవద్దని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: