నిందితుడు కళ్ల ముందు తిరిగినా పట్టించుకోరా?

Chakravarthi Kalyan
కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ హత్యోదంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యను చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. సుబ్రమణ్యం కుటుంబానికి అండగా ఉంటామని  చంద్రబాబు భరోసా ఇచ్చారు. బహిరంగంగా తిరుగుతున్నా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చెయ్యకపోవడంపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు.

గర్భవతిగా ఉన్న సుబ్రమణ్యం భార్య అపర్ణకు పెద్ద కష్టం వచ్చిందన్న చంద్రబాబు.. తన భర్త హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ కోరుతున్నారన్నారు. తెలుగుదేశంతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే పోలీసులు సుబ్రమణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారని చంద్రబాబు అన్నారు. కళ్ల ముందే పెళ్లిళ్లకు, పేరంటాలకు నిందితుడు వెళ్లినా అరెస్టు చెయ్యకపోవడం విడ్డూరమని చంద్రబాబు విమర్శించారు. పోలీసుల చర్యలు బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: