ఆ విషయంలో ఇండియా చాలా గ్రేట్‌?

Chakravarthi Kalyan

మనం బతకడమే కాదు.. ఇతరులనూ బతికిస్తాం.. సారవంతమైన భూములు కలిగిన ఇండియా.. అనేక పంటలు పండిస్తూ వాటిని విదేశాలకు ఎగుమతులు చేస్తోంది. ప్రపంచంలో ఒక్క బాస్మతి బియ్యం ఎగుమతులలో ఏబై శాతం మన దేశం నుంచే వెళ్తున్నాయి. ఈ ఏడాది టీ, కాఫీ, ఇతర సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు 50 బిలియనులు డాలర్లు వరకూ ఎగురమతి చేశాం.

వచ్చే మూడేళ్ళలో ఇండియా ఎగుమతులు వంద బిలియన్ డాలర్లు ఉత్పత్తులు చేయగలమని అంచనా ఉంది. ఇప్పటి వరకు విశాఖ పోర్ట్ నుంచే 17  మిలియన్ టన్నులు వరి ధాన్యం , ఏడు మిలియన్ టన్నులు గోధుములు మొత్తం 24  మిలియన్ టన్నులు ఎగుమతి చేశాం. ఏపీలో ఇప్పటి వరకు కాకినాడ నుంచి మాత్రమే జరిగే వరి ఎగుమతి జరిగేది. ఇప్పుడు విశాఖ నుంచి కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్ లో ఒక్క విశాఖ పోర్ట్ నుంచి వరి, గోధుమలు  కలిసి నలబై మిలియన్ టన్నులు ఎగుమతి పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: