దేశమంతా కరంట్‌ షాక్‌.. కళ్లు తెరిచిన కేంద్రం?

Chakravarthi Kalyan
దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా.173థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో దాదాపు 108కేంద్రాలను బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇప్పుడు కేంద్రం మేలుకొంది. ఉత్పత్తి కేంద్రాలకు వేగంగా బొగ్గు తరలించేందుకు రైల్వే శాఖను పురమాయించింది. దీంతో రైల్వే శాక  మరిన్ని చర్యలు చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలించేందుకు కొత్తగా 42 రైళ్లను రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన 40 రైళ్లను ఈనెల 25న, మిగిలిన వాటిని జూన్ 8న పునరుద్ధరించనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో  84శాతం సరకు రవాణా రైళ్లను బొగ్గు తరలింపునకు వినియోగిస్తోంది రైల్వే శాఖ.  ఇప్పటి వరకు రైల్వేశాఖ రద్దు చేసిన రైళ్ల ట్రిప్పుల సంఖ్య వెయ్యి దాటింది. అంతే కాదు.. పలు రైల్వే జోన్లలో ప్రయాణికుల రైలు సర్వీసులను రైల్వే శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన ట్రిప్పుల్లో 500 మెయిల్ ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. మిగిలిన వాటిలో 580 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: