మేడే స్పెషల్: ఆమె.. నిత్య కార్మికురాలు!
ఇంట్లో బడిలో అఫిసులో ఒకచోట అనేమి.. ప్రతిచోటా మగవారితో సమానంగా పని చేస్తుంది. అంతేనా ఆకాశంలో సముద్రంలో అన్నింటా ఆమే.. అన్ని బంధాలను సమన్వయం చేసేదీ ఆమెనే.. మంచి జరిగితే మగవారి గొప్ప అనీ.. చెడుజరిగితే ఆమెవల్లనేనని సమర్ధించుకుంటారు.. స్త్రీలను దేవతలతో పోలుస్తూ పూజించాలంటారు.. అడుగడుగునా అత్యాచారాలు హత్యలతో వేధించి సాధించి కాల్చుకుతింటారు..
ఇప్పుడు మేము ఒక్కరోజు స్త్రీ దినోత్సవానికై.. ఆతృతగా ఎదురుచూడడం లేదు .. కానీ బలంగా కోరుకుంటున్నాము.. ప్రతీరోజూ పురుషులతో సమానంగా జీవించాలని కోరుకుంటున్నాం..