ఎల్లో మీడియాపై ఆ వైసీపీ షాకింగ్ కామెంట్స్?

Chakravarthi Kalyan
జగన్ ప్రభుత్వంపై ఓ సెక్షన్ మీడియా నెగిటివ్ వార్తలు రాస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని వైసీపీ కూడా బాగానే కౌంటర్ చేస్తోంది. పత్రికల్లో నెగిటివ్ కథనాలు రాగానే వైసీపీ మంత్రులు ఆ మీడియాపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కొన్ని పత్రికల్లో ఏపీ పథకాలతో అప్పులపాలవుతోందని కథనాలు వచ్చాయి. దీనిపై విరుచుకుపడిన వైసీపీ మంత్రి నారాయణ స్వామి  ఏకంగా వీరసలు మనుషులేనా? అంటూ రెచ్చిపోయారు. వైసీపీ పథకాలన్నింటినీ నిలిపి వేసి.. ఇందులో కేవలం రెండో మూడో మాత్రమే అమలు చేయాలని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా అడుగుతున్నాయని ఆయన అంటున్నారు. ఇలా ఆలోచించే వారు అసలు మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు. అసలు వీరు నడుపుతున్నది పత్రికలా.. లేక పోతే.. వీళ్ళు నడుపుతున్నది రాజకీయ పార్టీనా అని అనుమానం వెలిబుచ్చారు. అసలు వీరు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హులేనా అంటూ కడిగి పారేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: