ఏపీ సీఎం జగన్ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా పేదల గృహ నిర్మాణాలకు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే13,105 కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఎంఐజీ ఇళ్ల పథకం అమలు చేయాలన్న జగన్ ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. జగనన్న ఇళ్లకు వినియోగించే విద్యుత్ పరికరాల్లో నాణ్యత లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటానన్నారు. ఈమేరకు జగన్ అధికారుకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే జగనన్న కాలనీల పేరిట జగన్ భారీగా గృహ నిర్మాణాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ఒక రేట్ ఫిక్స్ చేసి.. మిగిలిన మొత్తం లబ్దిదారులు వేసుకుంటే.. మంచి ఇల్లు కట్టి ఇస్తున్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.