అమ్మ ఒడి గురించి ఆ వార్త నిజమేనా..?
అమ్మ ఒడి పథకం నిబంధనలు మార్చారని ఇటీవల విపక్షాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. లబ్దిదారుల సంఖ్య తగ్గించేందుకు ఇలా చేశారని విమర్శిస్తున్నాయి. అందులో భాగంగానే 75 శాతం హాజరు నిబంధన విధించారని చెబుతున్నాయి. అయితే.. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అసలు అమ్మ ఒడిలో 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన ఇప్పటిది కాదట. అసలు అమ్మ ఒడి తొలి జీఓ నెం 63లోనే ఆ నిబంధన ఉందట. అయితే.. అమ్మ ఒడి పథకం ప్రారంభించడం జనవరిలో జరిగింది. అప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో ఉంది. అందువల్ల తొలి ఏడాది ఆ నిబంధను సడలించారు. ఆ తర్వాత ఏడాదిలో కరోనా వచ్చింది. అందువల్ల 2020–21 విద్యా సంవత్సరంలోనూ ఈ నిబంధన పాటించలేదు. ఇప్పుడు కరోనా తగ్గిపోయింది. అందుకే నిబంధన అమలు చేస్తున్నారు. అంతే తప్ప ఈ పథకంలో కొత్తగా ఏమీ చేయలేదని ప్రభుత్వం చెబుతోంది.