ఎందరో యువకులు అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగాల కోసం ఎదరు చూస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ జాబ్ మేళాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీన్ని వైయస్‌ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించడం విశేషం. ఏపీలోని యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఈ జాబా మేలా ఉంటుందట. ఈ జాబ్ మేళాకు మంచి స్పందన వస్తుందట. ఏపీలోని మూడు ప్రాంతాల్లో దశల వారీగా ఇలా జాబ్ మేళా నిర్వహిస్తారట. ఎవరైనా సరే.. వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ లెటర్ వచ్చినవారంతా ఈ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవాలంటున్నారు విజయసాయిరెడ్డి. ఈ జాబ్‌మేళా ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పిస్తారట. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రెండు రోజులు ఈ జాబ్ మేళా ఉంటుంది. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.