నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో దొంగలు పడ్డారట. ఓప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనందట. ఈ మేరకు కోర్టు బెంచి క్లర్కు స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారట. ఓ కీలక కేసులో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారట. గురువారం ఉదయం కోర్టు సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారట. వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించారట. దాన్ని పోలీసులు దాన్ని పరిశీలిస్తే అందులో ఉండాల్సిన పలు ఫైళ్లు మాయమయ్యాయట. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. కొత్త గా మంత్రి అయిన ప్రజాప్రతినిధి పనేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లోగుట్టు ఆ దేవుడికే ఎరుక మరి.