తెలుగు నేల: 23 జిల్లాల నుంచి 59 జిల్లా వరకు?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు వచ్చాయి. 2014కు ముందు వరకూ తెలంగాణలో పది జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 13 జిల్లాలు మొత్తం 23 జిల్లాలు ఉండేవి.. ఇలా 23 జిల్లాలుగా తెలుగు నేల చా ఏళ్లుగా ఉంది..1979లో విజయనగరం జిల్లా ఏర్పాటు తర్వాత.. మళ్లీ తెలుగునేలపై కొత్త జిల్లాలు 2014 వరకూ ఏర్పడలేదు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది.

తెలంగాణలో కేసీఆర్ సీఎం అయిన తర్వాత జిల్లాల విభజన చేపట్టారు. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను మొదట 31 జిల్లాలుగా.. ఆ తర్వాత మరో రెండు కలిపి 33 జిల్లాలుగా విభజించారు కేసీఆర్.. ఇప్పుడు జగన్ ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు. అలా మొత్తం తెలుగు నేల ఇప్పుడు తెలంగాణ 33, ఆంధ్రప్రదేశ్‌ 26 జిల్లాలు కలిపి మొత్తం 59 జిల్లాలు అయ్యింది. గతంలో 23 జిల్లాలు కాస్తా ఇప్పుడు 59 జిల్లాలు అయ్యాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: