Breaking : స్కూళ్లకు వేసవి సెలవలు.. ఎప్పటినుంచంటే?

Purushottham Vinay
తెలంగాణలోని అన్ని పాఠశాలలకు కూడా ఏప్రిల్ 24 వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉంటాయని పాఠశాలల విద్యాశాఖ తెలిపింది. మళ్లీ జూన్ 12 వ తేదీ నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయని విద్యాశాఖ తెలియజేసింది.అలాగే వచ్చే నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఎస్సే -టు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. వచ్చే నెల 23వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఇక ఈ విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23 వ తేదీ చివరి పని దినంగా ఉంటుంది.



కాగా మే 23 వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు కూడా పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.అలాగే రేపటినుంచి పాఠశాలల సమయాలను ప్రభుత్వం తగ్గించింది. వేసవి తీవ్రత దృష్ట్యా పాఠశాలలను రేపు అనగా గురువారం నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు  ఉదయం 8గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: