రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్‌?

Chakravarthi Kalyan
రష్యా సైన్యానికి ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. పొరుగు దేశాన్ని లొంగతీసుకోవాలని రష్యా చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్‌ సేనల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తాజాగా రష్యాకు చెందిన భారీ ల్యాండింగ్‌ నౌకను ఉక్రెయిన్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఓడరేవు పట్టణం బెర్డియాన్స్క్‌కు సమీపంలోని  అసోవ్‌ సముద్రంలో రష్యాకు చెందిన ఓర్స్క్‌ నౌకను ధ్వంసం చేసింది. ఈ  విషయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపిన ఉక్రెయిన్ నౌకా దళం.. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉంచింది. ఓ ఫొటోతోపాటు ఓడరేవు నుంచి మంటలు, పొగలు వెలువడుతున్న దృశ్యాలు ఉంచింది. అయితే దీనిపై ఇంకా రష్యా అధికారికంగా ఏమీ స్పందించలేదు. ఉక్రెయిన్‌ పై యుద్ధం మొదలై దాదాపు నెల రోజులు అవుతున్నా ఇంకా రష్యా మాత్రం విజయం అందుకోలేకపోయింది. దీనికి తోడు ఉక్రెయిన్ రోజురోజుకూ యుద్ధంలో పుంజుకుంటోంది. రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: