యాదాద్రిలో ఇవాళ కీలక ఘట్టం?

Chakravarthi Kalyan
పునర్నిర్మాణం తర్వాత కొత్త రూపు సంతరించుకున్న యాదాద్రిలో ఇవాళ కీలక ఘట్టం జరగబోతోంది. యాదాద్రీశుడి ఆలయ ఉద్ఘాటన ప్రక్రియలో ఇావాళ కీలకమైన రోజు.. ఆలయంలో పంచకుండాత్మక మహా యాగానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది. పంచనారసింహుల ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఈ పంచకుండాత్మక మహా యాగం నిర్వహించబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఆది పూజలకు శ్రీకారం చుడతారు. బాలాలయంలో మహారాజాభిషేకంగా అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహిస్తారు. 108 మంది పారాయణికుల ఆధ్వర్యంలో ఈ మహా యాగం నిర్వహిస్తారు. ఈ యాగం తర్వాత ఆయన పునః ప్రారంభం కార్యక్రమాలు ఉంటాయి. మహాకుంభ సంప్రోక్షణకు శ్రీకారం చుట్టి పంచ కుండాత్మక మహా యాగానికి అంకురార్పణ చేసి 108 కలశాలతో అభిషేకం నిర్వహించడం ద్వారా యాదాద్రి పునః ప్రారంభ వేడుకలకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. అయితే.. ఈ వేడుకలకు చిన జీయర్ స్వామి హాజరవుతారా.. లేదా అన్నది ఇంకా నిర్ణయం కాలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: