ఒక్క చంద్రబాబు తప్ప.. టీడీపీ సంచలన నిర్ణయం..?

Chakravarthi Kalyan
తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించింది. అంతకు ముందు బడ్జెట్ సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించినా.. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న సమస్యల తీవ్రత దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం సరికాదని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ్టి టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు.


అయితే.. ఈ సమావేశాలకు చంద్రబాబు మాత్రం హాజరుకాబోరు. ఆయన ఇంతకు ముందే అసెంబ్లీలో అడుగుపెట్టబోనన్న శపథాన్ని పాటిస్తారు. అందువల్ల చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అసెంబ్లీకి టీడీపీ హాజరయ్యే విషయంలో పార్టీలో తీవ్రమైన చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న డిమాండ్ బాగా వినిపించింది. చివరకు వరకూ హాజరుకాకూడదనే అనుకున్నా.. చివరకు సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. దీంతో ఏపీ బడ్జెట్ సమావేశాలు రంజుగా సాగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: