పాక్ యూట్యూబ్ ఛానళ్లకు ఇండియా షాక్..?
ఇకపై పాత్రికేయులు కూడా కోడ్ పాటించాల్సి ఉంటుందని.. అలా పాటించకపోతే ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి 150కి పైగా కేసుల్లో గట్టి చర్యలు తీసుకున్నట్టు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. అంతే కాకుండా తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసామని మంత్రి తెలిపారు. ఇండియా వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌లో నడిచే 35 వార్తా ఛానళ్లు, మరో 2 వెబ్సైట్లను జనవరి 21న బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.