పతంగులు ఎగరేస్తున్నారా..? చైనా మాంజాపై నిషేధం..!

Chakravarthi Kalyan
సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. ఈ పండుగకు పతంగులు ఎగరేయడం ఓ ప్రత్యేకత. ఈ సంస్కృతి హైదరాబాద్‌లో మరింత ఎక్కువ. అయితే.. ఈ పంతగులకు వాడే మంజా కారణంగా ఎన్నో పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అంతే కాదు.. అనేక మంది పిల్లలు కూడా గాయపడుతున్నారు. అందువల్లే ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించింది.

అయినా సరే.. ఈ చైనా మాంజను ఇంకా అనేక దుకాణాల్లో అమ్ముతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి చైనా మాంజా పై ఉన్న నిషేధ ఉత్తర్వులను మరింత పటిష్టంగా అమలుచేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని చైనా మాంజా అమ్మకం చేస్తోన్న దుకాణాలపై పోలీసుల కొరడా ఝళిపిస్తున్నారు. ప్రత్యేకంచి ఈ మాంజా అమ్మే ధూల్ పేట్, బేగం బజార్ లో అధికారుల సోదాలు నిర్వహించారు. పలు దుకాణాల్లో అమ్ముతున్న చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని.. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ చైనా మాంజా వాడొద్దని అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: